భారత్ తరఫున 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కొన్నాళ్లుగా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడంలో విఫలమవుతోన్న ఇషాంత్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి ఓ మోస్తరుగా రాణించాడీ ఫాస్ట్ బౌలర్. అయితే అతను 2021లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం సిరాజ్, అర్షదీప్, నవదీప్, ఉమ్రాన్ సహా పలువురు ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉన్నారు. కాబట్టి ఇషాంత్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం చాలా తక్కువని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటి మధ్య భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే సిరీస్‌లో ఇషాంత్ కొత్త అవతారంలో కనిపించనునన్నాడు. టీమిండియా తరఫున ఇషాంత్ మైదానంలో కనిపించకపోయినప్పటికీ, మైదానం వెలుపల కామెంటరీ బాక్స్‌లో వ్యాఖ్యాతగా దర్శనమివ్వనున్నాడు.

GIPHY App Key not set. Please check settings