in

లాస్ట్ ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్..సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

ల్లీ క్యాపిటల్ జట్టు వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు వరుస ఓటములకు వారే బాధ్యత వహించాలంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

IPL 2023: ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లు చివరి బంతి వరకు గెలిచే జట్టు ఏదో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంకు చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇప్పటి వరకు గెలుపు ఖాతాను తెరవలేక పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో డీసీ చివరి స్థానంలో నిలిచింది

 

ఢిల్లీ క్యాపిటల్ జట్టు వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. జట్టు డైరెక్టర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్ ఉన్నా ఢిల్లీకి వరుస ఓటములు తప్పడం లేదు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ జట్టు ఓటమి బాధ్యతలను రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ తీసుకోవాలని, వరుస ఓటములకు వారిదే బాధ్యత అన్నారు. గత సీజన్‌లో ఢిల్లీ ఫైనల్స్‌కు చేరినప్పుడు.. ఆ క్రెడిట్ జట్టు కోచ్ రికీ పాంటింగ్‌కు దక్కిందని సెహ్వాగ్ అన్నారు. అలా గెలుపు క్రెడిట్ అతని ఖాతాలో పడినప్పుడు ఓటమి బాధ్యతలను కూడా తీసుకోవాలని సెహ్వాగ్ చెప్పారు.

జట్టు ఓడినా, గెలిచినా కోచ్‌లదే ప్రధాన ప్రాత ఉంటుందని, ప్రస్తుతం ఢిల్లీ వరుస ఓటములకు బాధ్యతను‌సైతం రికీ పాంటింగ్‌దేనని సెహ్వాగ్ అన్నారు. అయితే, ఇదేమీ భారత క్రికెట్ జట్టు కాదు, అక్కడ ఎవరైనా గెలిస్తే తమ గొప్పగా భావిస్తారు. ఓడితే మాత్రం ఇతరులను నిందిస్తారన్న సెహ్వాగ్.. ఐపీఎల్ లో కోచ్ పాత్ర కేవలం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం మాత్రమే అన్నారు. అయితే, ఈసారి ఢిల్లీ టీం మాత్రం గొప్పగా రాణించలేదని, రాబోయే మ్యాచ్ లలో ఢిల్లీ గెలిచి తమ రాతను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ సెహ్వాగ్ అన్నారు.

Written by meraneed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు

తొలి ఓవ‌ర్‌లో 5 ప‌రుగులే ఇచ్చిన అర్జున్ టెండూల్క‌ర్‌