in

మే 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్

New Gst Rule For These Businesses From May 1 2023

New GST Rule : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. కొత్త జీఎస్టీ (GST) నిబంధనలు మే 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. పన్నుచెల్లింపుదారులు జీఎస్టీ నిబంధనల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే.. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు జీఎస్టీ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అంటే.. వ్యాపారాలకు సంబంధించి ఇన్‌వాయిస్ జారీ చేసిన 7 రోజులలోపు ఐఆర్‌పి (IRP)లో తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని GST నెట్‌వర్క్ తెలిపింది. ప్రస్తుతం, వ్యాపారాలు అటువంటి ఇన్‌వాయిస్ జారీ చేసిన తేదీతో సంబంధం లేకుండా ప్రస్తుత తేదీన ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేస్తుంటాయి.

పన్ను చెల్లింపుదారులకు GST నెట్‌వర్క్ ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది. దీని ప్రకారం.. రూ. 100 కోట్ల కన్నా ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం e-ఇన్‌వాయిస్ IRP పోర్టల్‌లలో పాత ఇన్‌వాయిస్‌లను రిపోర్టు చేయడానికి కాల పరిమితిని విధించాలని (GSTN) ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో కట్టుబడి ఉండేలా ఈ కేటగిరీలోని పన్ను చెల్లింపుదారులు రిపోర్టింగ్ తేదీలో 7 రోజుల కన్నా పాత ఇన్‌వాయిస్‌లను నివేదించడానికి అనుమతి ఉండదని GSTN తెలిపింది.

పన్ను చెల్లింపుదారులు తమ అవసరానికి అనుగుణంగా తగిన సమయాన్ని పొందవచ్చు. ఈ కొత్త ఫార్మాట్ మే 1, 2023 నుంచి అమల్లోకి రానుంది. ఈ పరిమితి ఇన్‌వాయిస్‌కు వర్తిస్తుంది. డెబిట్/క్రెడిట్ నోట్‌లను రిపోర్టులపై మాత్రం ఎలాంటి టైమ్ లిమిట్ ఉండదని పేర్కొంది. ఉదాహరణకు.. ఇన్‌వాయిస్‌కు ఏప్రిల్ 1, 2023 తేదీ ఉంటే.. ఏప్రిల్ 8, 2023 తర్వాత నివేదించలేమని GSTN తెలిపింది.

Written by meraneed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

sharmila arrest

షర్మిల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ కు విజయమ్మ

మేజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్..