in

ఐపీఎల్‌లో ఫస్ట్‌ వికెట్‌ తీసిన అర్జున్‌ టెండూల్కర్‌

Arjun Tendulkar Takes First-Ever IPL Wicket

సన్‌రైజర్స్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా రోహిత్‌ బంతిని అర్జున్‌కు అప్పగించాడు. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని జూనియర్‌ టెండూల్కర్‌ వమ్ము చేయలేదు. పదునైన స్వింగ్ బంతులతో హైదరాబాద్‌ టెయిలెండర్లను హడలెత్తించాడు. ఇక భువనేవ్వర్‌ వికెట్‌ తీయగానే కెప్టెన్‌ రోహిత్‌ పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్‌ని అభినందించాడు.

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌లో మొదటి వికెట్‌ తీశాడు. మంగళవారం ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ను ఔట్‌ చేసి ఐపీఎల్‌లో వికెట్ల బోణీ చేశాడు. 19.5 బంతిని భువనేవ్వర్‌ భారీ షాట్‌కు యత్నించగా రోహిత్‌ బంతిని అందుకున్నాడు. సన్‌రైజర్స్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా రోహిత్‌ బంతిని అర్జున్‌కు అప్పగించాడు. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని జూనియర్‌ టెండూల్కర్‌ వమ్ము చేయలేదు. పదునైన స్వింగ్ బంతులతో హైదరాబాద్‌ టెయిలెండర్లను హడలెత్తించాడు. ఇక భువనేవ్వర్‌ వికెట్‌ తీయగానే కెప్టెన్‌ రోహిత్‌ పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్‌ని అభినందించాడు. ఆతర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇతర ముంబై జట్టు సభ్యులందరూ అర్జున్‌ దగ్గరకు వచ్చి కంగ్రాట్స్‌ తెలిపారు. ఇక గ్యాలరీలో ఉన్న రోహిత్ సతీమణి రితికా, ముంబై ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున హర్ష ధ్వానాలతో స్టేడియాన్ని హోరెత్తించారు.  కాగా ఈ మ్యాచ్‌లో మొత్తం 2.5 ఓవర్లు వేసిన జూనియర్‌ టెండూల్కర్‌ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

Written by meraneed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

10వేల రూపాయి నాణేలతో నామినేషన్‌కు స్వతంత్ర అభ్యర్థి..

jagan chandrababu pavan kalyan twitter blue tick removed on Twitter

ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన జగన్, చంద్రబాబు,పవన్ కల్యాణ్..ఇంకా ఎందరో.