సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగ్రేటం చేస్తున్నాడు. ఇక ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా రెండు మ్యాచులు గెలిచి, రెండు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై రెండు మ్యాచుల్లో ఓడిపోయి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండడం ముంబైకి కాస్త కలిసి వచ్చే అంశం.
టాస్ ఓడిన కోల్‌కతా బ్యాటింగ్ ప్రారంభించింది. రహ్మానుల్లా గుర్బాజ్, ఎన్.జగదీశన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలి ఓవర్ ను వేశాడు. బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. కోల్‌కతా స్కోరు 5/0. రహ్మానుల్లా గుర్బాజ్ (4), ఎన్.జగదీశన్ (0) క్రీజులో ఉన్నారు.
GIPHY App Key not set. Please check settings