కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. రాజకీయ పార్టీల నేతలు విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆ రాష్ట్రంలోని వీధులన్నీ పార్టీల నేతల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుతం నామినేషన్ ల ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఓ స్వతంత్ర్య అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు 10వేల రూపాయి నాణేలను తీసుకొని వచ్చాడు. వాటిని చూసిన అధికారులు అవాక్కయ్యారు. రెండు గంటలు పాటు వారు శ్రమించాల్సి వచ్చింది.

GIPHY App Key not set. Please check settings