in ,

 కోటంరెడ్డి కోరిక నెరవేర్చిన జగన్

సొంత పార్టీలో ఉంటూ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్టీ మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కూడా అలానే ఉన్నారు. కానీ జగన్ అవేమీ పట్టించుకోకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరికను నెరవేర్చారు.

అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన కోటంరెడ్డితోనే శభాష్ అనేలా చేశారు జగన్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నెల్లూరు రూరల్  ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కోటంరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన అంశాల్లో బారాషాహీద్ దర్గా అంశం ఒకటి. ఈ దర్గా అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించామని కోటంరెడ్డి ఆరు నెలల పాటు తిరిగానని.. అయితే ప్రభుత్వం ఇప్పుడు జీవో విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. బారాషాహీద్ దర్గా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులకు సంబంధించి జీవో జారీ చేసింది. అందుకు సీఎం జగన్ కు కోటంరెడ్డి అభినందనలు తెలియజేశారు.

సాధారణంగా ప్రతిపక్ష నేతలు పదవుల్లో ఉండి అధికార పక్షాన్ని తమ నియోజకవర్గానికి ఏమైనా చేయమని అడిగితే చేయరు. ఎందుకంటే ఆ క్రెడిట్ వారి ఖాతాలో పడిపోతుంది కాబట్టి. ఓట్లు తమ ఖాతాలో పడవు కాబట్టి అధికార పక్షం ఎప్పుడూ ప్రతిపక్షాన్ని చిన్న చూపు చూస్తుంటుంది. అయితే ఈ విషయంలో జగన్  అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని అన్న మాటను నిజం చేసేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన కోరికను జగన్ నెరవేర్చారు. ఈ మధ్య కాలంలో తిరుగుబాటు ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఏపీ ప్రభుత్వం మీద వరుస విమర్శలు చేస్తున్న ఈయనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని వైసీపీ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.\

  • మేజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్..

    మేజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్..

    కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ  మేజిక్ ఫిగర్ 113 దాటింది. దీంతో పూర్తిస్థాయి మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. More


  • మే 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్

    మే 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్

    New GST Rule : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. కొత్త జీఎస్టీ (GST) నిబంధనలు మే 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. పన్నుచెల్లింపుదారులు జీఎస్టీ నిబంధనల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే.. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు జీఎస్టీ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అంటే.. వ్యాపారాలకు సంబంధించి ఇన్‌వాయిస్ జారీ చేసిన 7 రోజులలోపు ఐఆర్‌పి (IRP)లో తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని GST […] More


  • షర్మిల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ కు విజయమ్మ

    షర్మిల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ కు విజయమ్మ

Written by meraneed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

లక్నోపై టాస్ గెలిచిన పంజాబ్ కొత్త కెప్టెన్..